లోక్‌సభ రచ్చరచ్చ..సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎంపీలు

కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంపై లోక్ సభ దద్దరిల్లింది. దీనికంతా బీజేపీనే కారణమంటూ కాంగ్రెస్ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. దీనికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ఇతర పార్టీలను మనుగడను అంతం చేయాలనుకునే రాజకీయలకు ముగింపు పలకాలని అన్నారు.

మరోవైపు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, కర్ణాటకలో జరుగుతన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఇంటిపోరు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన ఇంటి వివాదాన్ని పరిష్కరించుకోకుండా… లోక్ సభ సమావేశాలకు ఆటంకం కలిగిస్తోందని మండిపడ్డారు.

రాజ్యసభలో కూడా ఇదే గందరగోళం నెలకొనడంతో… సభను సభాపతి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.