అవినీతిలేని పారదర్శక ప్రభుత్వం వచ్చింది :ఎంపీ విజయసాయిరెడ్డి

విపక్షాలపై విరుచుకుపడినా, స్వపక్షానికి అనుకూలంగా మాట్లాడినా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నిన్న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూడా ఆయన ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. 

జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో నవ్యాంధ్రలో నవశకం మొదలయ్యిందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహిత పాలనను పారదర్శకంగా జగన్‌ అందించనున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను తొలగించడమే ఆయన ఆకాంక్ష అని, ఇందుకోసం ఆయన నిరంతరం శ్రమిస్తారని ట్వీట్‌ చేశారు.