హైదరాబాద్ హౌస్ లో శ్రీలంక అధ్యక్షుడితో భేటీ :మోదీ

భారత ప్రధానిగా నిన్న రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ… అప్పుడే తన అధికారిక కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీతో పాటు ఈరోజు మోదీ మరో నాలుగు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.

మరోవైపు, తన కొత్త కేబినెట్ లో పాత వారిలో చాలా మందికి చోటు కల్పించిన మోదీ… మేనకాగాంధీ, సురేశ్ ప్రభు, రాధా మోహన్ సింగ్, రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ వంటి నేతలకు మరో అవకాశాన్ని ఇవ్వలేదు. తనకు అత్యంత నమ్మకస్తుడైన అమిత్ షాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్.జయశంకర్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు.