అమెరికాలో పాఠశాలలో కాల్పులు..

అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో అనేక అనుచిత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలకు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుతున్నారు. తాజాగా కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌లో ఓ పాఠశాల విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఉదాంతం చోటు చేసుకుంది.

ఓ తరగతి గదిలోకి ప్రవేశించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డావారిని సమీపంలోని హాస్పిటల్‌కి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తోటి విద్యార్థులే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.