రాజస్థాన్‌లో కూలిన మిగ్‌ 27

జోధ్‌పూర్‌ : మిగ్‌ 27 యుద్ధ విమానం ఒకటి ఆదివారం ఉదయం రాజస్థాన్‌లో కూలిపోయింది. మిగ్‌-27 యూపీజీ విమానం జోధ్‌పూర్‌ నుంచి బయలుదేరిన కాసేపటికే కూలినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడికి 180 కిమీ దూరంలోని సిరోహి ప్రాంతంలో ఇది కూలినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి అధికారులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.