విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు

భారత బ్యాంకులకు వందల కోట్లను ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. బెంగళూరులో ఉన్న మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫెరా చట్టం కింద దాఖలైన కేసులో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 10లోగా మాల్యా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. మరికొంత గడువు కావాలని న్యాయవాది కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. విచారణ సందర్భంగా మాల్యాకు మొత్తం 159 ఆస్తులు ఉన్నాయని బెంగళూరు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.