ఆర్థిక నేరస్తుడి అరెస్ట్

ఇండియాలోని బ్యాంకులకు 13వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీని ఎట్టకేలకు లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 2018న అంతర్జాతీయంగా అన్ని దేశాలకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది భారత్. ఈ నోటీసులపై స్పందించిన బ్రిటన్.. ముమ్మర చర్యలు చేపట్టి అరెస్టు చేసింది.

వజ్రాల వ్యాపారం పేరుతో నీరవ్ మోడీ, అతని మామ మెహల్ చౌస్కీ ఇద్దరూ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 13.5 వేల కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియా నుంచి పారిపోయారు. ఏడాదిగా ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు.

కొన్ని రోజుల క్రితం లండన్‌లోని వీధుల్లో తిరుగుతుండగా.. టెలిగ్రాఫ్ మీడియా కంట పడ్డారు నీరవ్ మోడీ. లండన్ లో వజ్రాల షాపు నిర్వహిస్తున్నట్లు లోకానికి తెలిసింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత లండన్ పై ఒత్తిడి పెంచింది భారత్. ఈ మేరకు నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు.

ఇండియా ఎప్పుడు తీసుకొస్తారు అనేది ఇంకా తెలియరాలేదు. ఇండియా నుంచి నీరవ్ మోడీ 2018, ఫిబ్రవరిలో వెళ్లిపోయాడు.