వైసీపీలోకి వెంకటగిరి చైర్‌పర్సన్‌!

వెంకటగిరి (నెల్లూరు): వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద దంపతులు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆనం రామానారాయణరెడ్డి చైర్‌పర్సన్‌ ఇంటికి విచ్చేసి చైర్‌పర్సన్‌ భర్త బాలకృష్ణ, డక్కిలి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ఆదిరెడ్డి మల్లిరెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్‌ చల్లా మల్లికార్జున్‌తో సుమారు అరగంట పాటు మంతనాలు జరిపారు. ఈ నెల 12న చైర్‌పర్సన్‌ దంపతులు, కొందరు టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.