మరోసారి కుక్క బుద్ధిని బయటపెట్టిన చైనా

చైనా ఉప విదేశాంగమంత్రి కాంగ్‌ జున్‌యు గురువారం పాకిస్థాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రస్తుతం పాక్‌ పర్యటనలో ఉన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చిందుకే కాంగ్ జున్‌యు ఇస్లామాబాద్‌ వెళుతున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఇందులో భాగంగా భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పాక్‌ సంయమనం పాటిస్తుందని కాంగ్‌ ప్రశంసించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను చైనా చర్చిస్తోంది.భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నివారణకు కృషిచేస్తామని కాంగ్‌ అన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాఖ్యలకు స్పందించిన పాక్‌ ప్రభుత్వం చైనాకు ధన్యవాదాలు తెలిపింది.