అత్యుత్తమ బ్రాండ్ గా యాపిల్ ..!

టాప్-100 ఉత్తమ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను ప్రముఖ బ్రాండ్ కన్సల్టింగ్ సంస్థ ఇంటర్ బ్రాండ్ విడుదల చేసింది. టెక్నాలజీ సంస్థ యాపిల్ తయారు చేసే ఐఫోన్ అత్యత్తమ బ్రాండ్ గా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్ రెండో స్థానంలో నిలవగా.. అమెజాన్ మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల వరుస వివాదాలతో సతమతం అవుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ 9వ స్థానానికి పడిపోయింది. ఇక మైక్రోసాఫ్ట్ కంపెనీ, కోకాకోలా సంస్థలు 4, స్థానాల్లో నిలిచినట్లు ఇంటర్ బ్రాండ్ తెలిపింది. వీటితో పాటు శామ్ సంగ్-6, టొయోటా-7, బెంజ్-8, ఫేస్ బుక్-9, మెక్ డొనాల్డ్స్-10 దక్కించుకున్నాయని వెల్లడించింది.

Post expires at 4:47pm on Thursday October 4th, 2018