Breaking News

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూజిల్యాండ్ ప్రధాని పెళ్లి వాయిదా

24 th Jan 2022, UTC

New Zealand Prime Minister: కొవిడ్ కొత్త వేరియెంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు అమలుచేస్తున్నాయి.  న్యూజిలాండ్‎లోనూ ఒమిక్రాన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.    కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేయడంతో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్  తన స్వంత వివాహాన్ని రద్దు చేసుకున్నారు. కరోనా కొత్త ఆంక్షలను వెలువడిన తరువాత.... తన వివాహాన్ని మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించింది. రెండు డోసుల టీకాలు తీసుకున్న 100 మంది వ్యక్తులతో వివాహ వేడుకలు నిర్వహించుకునే అవకాశమున్నప్పటికీ... తాను ఆ అవకాశాన్నీ వినియోగించుకోవడం లేదని ఆర్డెర్న్ తెలిపారు. 

తన పెళ్లికి హాజరయ్యేందుకు వస్తున్న వారిలో తొమ్మిది మందికి ఒమిక్రాన్ సోకిందని,  అంతేకాకుండా.. వారు ప్రయాణించిన విమాన అటెండెంట్‌కు కూడా ఇన్‌ఫెక్షన్ రావడంతో న్యూజిలాండ్‎లో ఆదివారం అర్ధరాత్రి నుంచి ‘రెడ్ సెట్టింగ్’ఆంక్షలను విధించవలసి వచ్చిందని ప్రధాని తెలిపారు. ఒమిక్రాన్ మునుపటి డెల్టా వేరియంట్ కంటే చాలా ఎక్కువగా వ్యాపిస్తోందని,   మహమ్మారి వల్ల ఇబ్బందిపడిన వారిలో తానూ ఉన్నానని ఆర్డెర్న్ తెలిపారు.  ప్రియమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారితో ఉండలేకపోవడం అత్యంత బాధాకరమన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి 

తెలంగాణలో నేటి నుంచి ఆన్ లైన్ క్లాసులు

 క్యాసినో పై ముందు ఎన్టీఆర్ ను ప్రశ్నించాలి.. రామ్ గోపాల్ వర్మ

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox