Breaking News

మా చేపలను చైనా కొల్లగొడుతోంది.. పాక్ ప్రజల ఆందోళన- KVV SARADHI

01 st Dec 2021, UTC

పరాయి దేశాల ఆర్ధిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని స్నేహం పేరుతో వారిని వంచించడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. పొరుగు దేశాలను ఈ విధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలు డ్రాగన్ ఇటీవల ముమ్మరం చేసింది. ఇందులో భాగమే చైనా పాకిస్థాన్‌ ఎకనమిక్ కారిడార్. ఈ ప్రాజెక్టు పేరుతో పాక్‌ భూభాగంపై ఆధిపత్యం చెలాయించడం, అక్కడి ప్రజలనే పరాయి వారిగా చూడటం ఆగ్రహానికి కారణమయ్యింది. చైనాతో అంటకాగిన పాక్‌ ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది.

పాకిస్థాన్ మత్స్య సంపదను చైనా దోచేస్తోందంటూ పాకిస్థాన్ ప్రజలు ఆందోళన చేపట్టారు. బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టులో డ్రాగన్ దేశం భారీ నౌకలతో చేపల వేట సాగిస్తోంది. దీంతో పాకిస్థాన్ ప్రజలు చైనా పాక్ ఎకనమిక్ కారిడార్‌పై ఆందోళనలు చేపట్టారు. పాక్ ప్రభుత్వం చైనాతో అంటకాగి తమకు ఉపాధి లేకుండా చేస్తోందంటూ గ్వాదర్‌ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. చిన్నారులతో పాటు మహిళలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. భారీ నిరసనలతో గ్వాదర్ పోర్టు హోరెత్తిపోతోంది.బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టులో తమ సహజ సంపదలను చైనీయులు దోచేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు.  పది రోజుల నుంచి గ్వాదర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఈక్రమంలో ఆందోళనలకు మరింత ఉదృతం చేయటానికి చిన్నపిల్లలు, మహిళలు గ్వాదర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. మొదటిగా ఏ దేశాలైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాయో ఆ దేశాలపై చైనా కన్ను వేస్తుంది. వారి ఆర్ధిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని స్నేహం..సత్సంబంధాల పేరుతో పక్కా ప్లాన్ తో వారిని వచించటం చైనాకు అలవాటే. 

శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా చైనా వ్యవహారం ఉంటుంది. ఈ క్రమంలో పొరుగు దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవానికి పన్నాగాలు పన్నుతుంది. దాంట్లో భాగంగానే చైనా డ్రాగన్ ఇటీవల పాకిస్థాన్‌ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటు చేసింది.ఈ ప్రాజెక్టు పేరుతో పాక్‌ భూభాగంపై ఆధిపత్యం చెలాయించడం..ఆ కాస్త పట్టు సాధించాక..స్థానిక ప్రజల్నే పరాయివారిగా చూడటం మొదలుపెడుతుంది. అక్కడ స్థలం తమదే అన్నట్లుగా పెత్తనం చెలాయిస్తుంది. దీంట్లో భాగంగానే గత కొన్ని నెలల క్రితం చైనా తన భారీ నౌకలతో గ్వాదర్ పోర్టులో చేపల వేట మొదలు పెట్టింది.  గ్వాదర్‌ ప్రాంతంలో దాదాపు 20 లక్షల మంది పాక్‌ ప్రజలు చేపల వేటపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు.దీంతో చైనా తమ మత్స్య సంపద దోచేస్తోందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తు ఆందోళన చేపట్టారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox