నందమూరి ఫ్యాన్స్ కు షాక్..!

తనకు వ్యాపారాల్లో రాణించాలని ఉందని, హీరో కావడంపై ఆసక్తి లేదని నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ స్పష్టంగా చెప్పేశాడన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం క్రితం యాక్టింగ్, డ్యాన్స్ క్లాసులకు మోక్షజ్ఞ వెళ్లినట్టు వార్తలు రాగానే, నందమూరి అభిమానులంతా త్వరలోనే కొత్త వారసుడు రానున్నాడని సంబరపడ్డారు. అయితే, తండ్రి బలవంతం మీదే మోక్షజ్ఞ ఈ క్లాస్ లకు హాజరయ్యాడని, తిరిగి వచ్చి, తన రెగ్యులర్ కార్యకలాపాల్లోనే నిమగ్నం అయ్యాడని తెలుస్తోంది. ఇటీవల ‘మోక్షజ్ఞ కేరాఫ్ కాఫీ షాప్’ అంటూ ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రత్యేక కథనం సైతం ప్రచురితమైంది. అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటే, తనకు సినిమాలంటే ఆసక్తి లేదని చెప్పడంతో అభిమానులకు షాకిస్తోంది. ఇక ఈ విషయంలో బాలకృష్ణ ఎలా స్పందిస్తారో?!