చరణ్ దాతృత్వం తో సైరా టీమ్ ఫుల్ ఖుషీ..

మెగా వారసుడు రామ్ చరణ్ అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాతగా, బిజినెస్ మాన్ గా రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. బాబాయ్ పవన్ బాటలో నడుస్తూ ఆపదలో ఉన్న వారికి సహాయ పడడం కూడా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న చరణ్ ప్రస్తుతం సైరా చిత్ర నిర్మాణంలో బిజీ గా వున్నారు.

చరణ్ తాజాగా జార్జియాలో జరుగుతున్న తన తండ్రి చిత్రం ‘సైరా’ చిత్రీకరణను చూడటానికి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన నిర్మాత హోదాలో సినిమాకు పనిచేస్తున్న సభ్యులందరికీ డాలర్స్ ఇచ్చి వాటితో షాపింగ్ చేసుకోమన్నారట. దీనితో దీంతో యూనిట్ సభ్యులు మొత్తం ఫుల్ ఖుషీ అయ్యారట. చరణ్ లాంటి నిర్మాత దొరకడం తమ అదృష్టం గా భావిస్తూ చెర్రీ ని తెగ మెచ్చుకుంటున్నారు చిత్ర యూనిట్.

Post expires at 11:05am on Friday October 5th, 2018