మగవాళ్ళు అలా ఉంటే అస్సలు నచ్చదు: రష్మి

రీసెంట్ గా రష్మి గౌతమ్ ట్విట్టర్ లో చాట్ చేస్తున్న సమయంలో ఒక ఫాలోవర్ ఈ విషయంపై ప్రశ్నిస్తూ మనం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి మగవాళ్ళకు.. ఆడవాళ్ళకు ఇద్దరికీ రూల్స్ ఉంటాయి. మరి మగవాళ్ళ డ్రెసింగ్ లో మీకు నచ్చని అంశాలు ఏంటి? అని అడిగాడు. ఈ ప్రశ్నకు జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చింది రష్మి.

నాకు షార్ట్స్ వేసుకుకొని కాళ్ళపై బొచ్చుతో తిరిగేవారంటే ఇష్టం లేదు. ఇక కట్ బనీన్లు వేసుకొని చంకల్లో వెంట్రుకలు కన్పిస్తూ ఉన్నా నచ్చదు. హాఫ్ షర్ట్స్ వేసుకొని చేతులను ఓవర్ గా ఎక్స్ పోజ్ చేస్తే నచ్చదు. బీచుల్లో చొక్కా బనియన్లు లేకుండా వేలాడే చెస్ట్ తో అటూ ఇటూ తిరిగేవాళ్ళంటే అస్సలు నచ్చదు.. ఇవి కొన్నే. ఇంకా ఉన్నాయి.. నా లిస్టు చాలా పెద్దది అంటూ షాకిచ్చే ఆన్సర్ చెప్పింది. మరి ఎలా ఉంటే నచ్చుతుందో అనే మాత్రం చెప్పనే లేదు ఈ హాట్ భామ.