నా కూతురి పెళ్ళికి మొదటి ఆహ్వానం అతనికే: రజనీ కాంత్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్‌ వనగమూడితో ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం ఘనంగా జరగబోతోంది. దీంతో రజనీ ఇప్పటికే సినీ ప్రముఖుల నివాసాలకు వెళ్లి మరీ వారిని ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా..నటుడు ప్రభు.. రజనీతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇది ఇలా ఉంటే..పెళ్లి గురించి రజనీ తమిళ మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి పెళ్లి నేపథ్యంలో మొదటి ఆహ్వానాన్ని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడైన తిరునవుక్కరాసర్‌కే ఇచ్చాను.

ఎందుకంటే సౌందర్య పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అతనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అందుకే మొదటి శుభలేఖ తిరుకు ఇచ్చాను అని వివరించారు. ఇక పెళ్లి అనంతరం ఫిబ్రవరి 12న ఘనంగా వివాహ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.