Breaking News

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. డ్రగ్ వ్యాపారి ఫ్లాకోను అరెస్ట్ చేసిన ఎన్‌సిబి

28 th Jan 2022, UTC

Sushant Singh Rajput case : నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (ఎస్‌ఎస్‌ఆర్) మరణానికి సంబంధించి మాదక ద్రవ్యాల వ్యాపారి సాహిల్ షా అలియాస్ ఫ్లాకోను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసింది. సుశాంత్ పొరుగునే వుండే  31 ఏళ్ల ఫ్లాకో గత ఎనిమిది నెలలుగా పరారీలో ఉన్నాడు.

ఏప్రిల్ 2021లో అరెస్టయిన మరో ఇద్దరు నిందితుల నుండి 310 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నందుకు సంబంధించి ఫ్లాకోపై విచారణ జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు-గణేష్ షేర్ మరియు సిద్ధాంత్ అమీన్‌లను అరెస్టు చేసిన తరువాత ఎన్‌సిబి ఫ్లాకోపై దాడి చేసింది, కానీ అతను అదృశ్యమయ్యాడు. బుధవారం ఫ్లాకో ఎన్‌సీబీ ఎదుట హాజరై లొంగిపోయాడు., అతను తన భార్య, టీవీ నటితో కలిసి దుబాయ్‌లో ఉన్నాడని మరియు ఇటీవలే తిరిగి వచ్చాడని సమాచారం.

2020లో  సుశాంత్ కు  సంబంధించిన డ్రగ్స్ కేసుకు సంబంధించి మొదటి ఇద్దరు నిందితులు-కరణ్ అరోరా మరియు అబ్బాస్ లఖానీలను అరెస్టు చేసినప్పుడు ఫ్లాకో పేరు కూడా కనిపించిందని యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి 

 మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

’పుష్ప‘ విజయం బాలీవుడ్ తారల ముఖం మీద చెంపదెబ్బ కమల్ ఆర్ ఖాన్

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox