Breaking News

టాలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్ని నాని సమావేశం

20 th Sep 2021, UTC

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఈ మేరకు పేర్ని నాని మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై చర్చించామని వివరించారు. ఆన్‌లైన్ పద్ధతిలో సినిమా టికెట్లు అమ్మే ప్రక్రియకు అందరూ అంగీకారం తెలిపారన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అమలుపై తాము కూడా ఇన్‌పుట్స్ ఇచ్చి సహకరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు.

ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించాం. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తాం. . ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి. అందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందినిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది అని అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యమైనంత మేర సానుకూలంగా స్పందించాం. ఈ రోజు జరిగిన సమావేశంలో బెనిఫిట్‌ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదు అని పేర్ని నాని తెలిపారు.

నిజానికి ఈ సమావేశం  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో జరగాల్సి ఉంది. దానికి మెగాస్టార్ చిరంజీవి , తదితర సినీ పెద్దలు హాజరవ్వాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox