Breaking News

ఆగస్ట్ 12న రిలీజవుతున్న 'మాచర్ల నియోజకవర్గం'

25 th Jun 2022, UTC

Tollywood: యంగ్  హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ లో వుండటం చేత సినిమా వాయిదా పడింది. ఇప్పుడు 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం కొత్త విడుదల తేది ఖరారయింది. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox