Breaking News

రామ్ చరణ్ 15 లో భారీ ట్రైన్ ఎపిసోడ్

21 st Sep 2021, UTC
రామ్ చరణ్ 15 లో భారీ ట్రైన్ ఎపిసోడ్

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ -శంకర్  కాంబినేషన్లో  వస్తున్న చిత్రంలో  భారీ ట్రైన్  ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాలో కీలకమైన సమయంలో వస్తుంది. ఇది  సినిమాకి ప్రధాన హైలైట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగు సినిమాల్లో ట్రైన్ ఎసిపోడ్ లు చాల వచ్చాయి. అయితే ఒక్క నరసింహనాయుడు చిత్రంలో  ఆకట్టుకున్న విధంగా మరే చిత్రంలోనూ ఇవి వర్కవుట్ అవలేదు.

రామ్ చరణ్‌ సినిమాలో  ఈ ట్రైన్ ఎపిసోడ్  వందలాది మంది ఫైటర్‌లతో  రూపొందిస్తారు.  ఈ  ఎపిసోడ్ కోసం భారీ బడ్జెట్ కేటాయించాలని శంకర్ నిర్మాతలను కోరాడు. దీనికోసం   రూ. 10 కోట్లు ఖర్చు చేస్తారని తెలుస్తోంది.. ఎపిసోడ్ చిత్రీకరణకు  ప్రత్యేక రైలు సెట్ నిర్మించబడుతుంది. ఈ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభించారు. షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.

ఈ చిత్రంలో  కియారా అద్వానీ కథానాయిక.  శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇంకా పేరు పెట్టని  ఈ భారీ బడ్జెట్ సోషల్ డ్రామా ను  దిల్ రాజు నిర్మిస్తారు.ఇది  2023 సంక్రాంతి  కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox