Breaking News

పుష్పలో ఫారెస్ట్ అధికారిగా ఫహద్ ఫాజిల్

21 st Sep 2021, UTC
పుష్పలో ఫారెస్ట్ అధికారిగా ఫహద్ ఫాజిల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప  షూటింగ్ వేగంగా జరుగుతోంది. శేషాచలం అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కధాంశంగా  పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా నటిస్తున్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. పుష్ప చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.

ఎమోషన్‌తో కూడిన  ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఫహద్ ఫాజిల్ అటవీ అధికారిగా కనిపించబోతున్నారు. ఫహద్ మరియు అల్లు అర్జున్  ఒకరితో ఒకరు తలపడే సన్నివేశాలు  ఆసక్తికరంగా వుంటాయని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ వీటికి సంబంధించిన  బలమైన సన్నివేశాలను వ్రాసారని తెలుస్తోంది.

ప్రతిభావంతులైన స్టంట్ డైరెక్టర్ల పర్యవేక్షణలో భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎపిసోడ్‌లను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ మరియు మైత్రి నిర్మాతలు పుష్ప చిత్రీకరణలో ఎక్కడా రాజీపడటం లేదు.ఐదు భాషల్లో రూపొందుతున్న పుష్ప: పార్ట్ 1 క్రిస్మస్ కు  విడుదల కానుంది. అల్లు అర్జున్ సరసన  రష్మిక మందన్న నటిస్తోంది.  ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox