ఫేమస్ అవ్వని ‘వరల్డ్ ఫేమస్ లవర్’..!

88

అర్జున్ రెడ్డి తరవాత విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో పాటే, ఆయన సినిమాలపై అంచనాలు కూడా పెరుగుతుంటాయి. అయితే, తాజాగా ఆయన నటించిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ ను చూసి ఇది కూడా అర్జున్ రెడ్డి తరహా మూవీ అనుకున్నారు. ట్రైలర్ కొన్ని వర్గాలని నిరాశపరిచిన సినిమా పై కొంత అంచనా వేసుకున్నారు అభిమానులు. అయితే, వాలెంటైన్స్ డే సందర్భం గా విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. సాగుతున్న కధనం, మూస ధోరణి లో ఉన్న కధ, బలం లేని స్క్రీన్ ప్లే ఈ సినిమా కు మైనస్ పాయింట్లు. మరోవైపు విజయ్ దేవర కొండ తన నటనతో సినిమా నిలబెట్టడానికి శాయ శక్తులా కృషి చేసాడు. మందకొడిగా సాగుతున్న సన్నివేశాల్లో కూడా నటనతో మెప్పించాడు. ఓవరాల్ గా ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఫేమస్ అవుతాడో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Post expires at 4:58pm on Friday February 14th, 2020