కత్తి మహేశ్‌పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి..!

2353

వరల్డ్ ఫేమస్ లవర్స్ సినిమా చూసేందుకు వచ్చిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఇటీవల శ్రీరాముడిపై కత్తి మహేశ్ ఓ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన బజరంగ్ దళ్ కార్యకర్తలు ముగ్గురు ప్రసాద్ ఐ మాక్స్ థియేటర్ లో కత్తి మహేశ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురినీ రాంగోపాల్ పేట్ ps కు తరలించారు.