చిన్నారులతో సూర్య ఫ్లైట్‌ జర్నీ..!

26

కోలీవుడ్‌ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా .త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం ఈ సినిమా నుంచి ‘పిల్ల పులి’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ పాట విడుదల కార్యక్రమం ఎంతో విభిన్నంగా జరిగింది.నిరుపేద విద్యార్థులకు సాయం చేయడమే లక్ష్యంగా సూర్య ‘అగరం’ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు.అయితే ‘అగరం’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల కొంతమంది పేద విద్యార్థులకు.. ‘మీ కలలను ఎలా సాకారం చేసుకోవాలనుకుంటున్నారు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న వారందరిలో మెప్పించేలా రాసిన 100 మంది చిన్నారులను ఎంపిక చేశారు. అలా ఎంపికైన వారందరితో కలిసి సూర్య విమానంలో ప్రయాణం చేశారు. పిల్లల సందడి మధ్య ‘ఆకాశమే హద్దురా’ ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు.