‘అరణ్య’మ్ లో రానా..!

11

బాహుబలి భళ్లాలదేవుడు ఆదిమవాసి గా కొత్త అవతారం ఎత్తాడు. ఇప్పటికే బాలీవుడ్ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న రానా ప్రభు సోలొమన్ దర్శకత్వం లో ‘హాథీ మేరే సాథీ’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు కన్నడలో ‘కాదన్’, తెలుగులో ‘అరణ్య’గా విడుదల చేస్తున్నారు. ఆదిమవాసిలు అడవినే నమ్ముకుని జీవిస్తారు. అలాంటి ఓ ఆదిమవాసి అడవికి ఆపద వస్తే ఏమి చేస్తాడో ఈ చిత్రం లో చూపించనున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా హిందీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం లో ఆదిమవాసి పాత్రకు రానా జీవం పోసాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కేరళ అడువుల్లో జరుగుతోంది. ఏప్రిల్ 2 వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.