మొక్కలు నాటిన మహానటి..!

10

రాజ్యసభసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మారుతున్న పర్యావరణ పరిస్థితులను అదుపు చేసేందుకు, పర్యావరణ పరిరక్షణ ఆకాంక్షిస్తూ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమంలో. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా, ప్రముఖ సినీ నటి కీర్తిసురేశ్, యువ దర్శకుడు వంశీ అట్లూరి గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని.. సూరారం టెక్ మహీంద్ర క్యాంపస్‌లో మొక్కలు నాటారు. కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో. ప్రతీ ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కీర్తిసురేశ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.