మెగా హీరోలకు పవర్ స్టార్ అభినందనలు

24

మెగా హీరోలు అల్లుఅర్జున్‌, సాయిధరమ్‌ తేజ హీరోలుగా నటించిన చిత్రాలు ఇటీవల మంచి విజయాలు సాధించడంతో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సినిమా హీరోలతో పాటు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, సినిమా బృందాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా ‘అలవైకుంఠపురములో’ సినిమా ఈ నెల 12న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా విజయం సాధించడంతో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌, తమన్‌, హరీశ్‌శంకర్‌ అల్లు అర్జున్‌ను అభినందించారు. తాజాగా పవర్‌స్టార్‌ సైతం సినిమా ప్రొడ్యూసర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
‘సుప్రీం’ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే. డిసెంబర్‌ 20న విడుదలై తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్టుగా నిలిచింది. ఈ సినిమా చూసి ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌తేజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ‘ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.. ప్రతిరోజూ పండగే’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.