అదిరిందమ్మా సమంతా…!

4

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96 ‘ ను తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. అంతగా ఆకట్టుకుంది వారి జంట. అయితే, ఈ చిత్రాన్ని తెలుగు లో ‘జాను’ గా దిల్ రాజు, శిరీష్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్ర తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను అమితం గా ఆకట్టుకుంది. సమంతా, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు.సమంత క్యూట్ నెస్ తో శర్వానంద్ యాక్టింగ్ తో ఇరగదీశారని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. శర్వానంద్, సమంతా జంట చూడముచ్చ్చటగా ఉండి, ఈ సినిమా కి ఫ్రెష్ లుక్ ను తీసుకువచ్చింది.