దర్బార్ సందడి.. బాక్సాఫీస్ దాడి..!

64

ఇండియన్ సూపర్ స్టార్ రజినీ మ్యానియా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా.. కలెక్షన్ల వర్షం కురిపించ గల ఏకైన స్టార్ రజినీ కాంత్. తమిళ నాట వసూళ్ల సునామిని సృష్టిస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా తన జోరును కొనసాగిస్తున్నాడు. కాలా, పేట్టా వంటి చిత్రాల తరువాత దర్బార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తలైవా.

దర్బార్ చిత్రం తలైవా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలానే ఉంది. రజినీ స్టైల్ మ్యానరిజం, నడక, నడత, మాట తీరు ఇలా ప్రతీ ఒక్కటి తలైవా ఫ్యాన్స్‌ను పిచ్చెక్కేలా చేస్తుంది. డెబ్బై యేళ్ల వయసులో రజినీ ఎనర్జీని చూస్తే నోరెళ్ల బెట్టకుండా ఉండలేరు. ఆ స్థాయిలో నటించి.. యంగ్ హీరోలకు ధీటుగా నిలబడ్డాడు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీ చేయడం, టీజర్, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండటంతో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్టే మొదటి రోజు భారీగానే కొల్లగొట్టినట్టు ట్రేడ్ పండితులు లెక్కలు బయటకు వదిలారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున విడుదల చేసిన ఈ చిత్రం దాదాపు 8కోట్ల వరకు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. తమిళ నాట 35, ఓవర్సీస్‌లో 35, ఇలా మొదటి రోజే వంద కోట్లకు పైగా కొల్లగొట్టి తలైవా స్టామినా ఏంటో మరోసారి దర్బార్ నిరూపించింది. మొదటి రోజు వంద కోట్లకు పైగా రాబట్టిన దర్బార్ రెండో రోజూ అదే జోరును కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు ఈ చిత్రం తమిళ నాట 15కోట్లు, రెస్టాఫ్ ఇండియా 15కోట్లు ఓవర్సీస్‌లో 20కోట్లు ఇలా మొత్తంగా వేసుకుంటే దాదాపు అరవై కోట్లు రాబట్టే అవకాశముందని తెలుస్తోంది. అయితే రేపటి నుంచి తెలుగు నాట దర్బార్‌కు పెద్ద దెబ్బ తగిలే చాన్స్ ఉంది. రేపు మహేష్ బాబు సరిలేరు చిత్రంతో రంగంలోకి దిగబోతోన్నాడు.