కోలీవుడ్ నటుడితో గుత్తా జ్వాల ప్రేమ..!

135

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల న్యూ ఇయర్ విశేష్ తెలుపుతూ.. తమిళ హీరో విష్ణు విశాల్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. గుత్తా జ్వాల హీరో విష్ణు విశాల్ తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో వీరిద్దరీ మధ్య ఏదో నడుస్తుంది అన్న గుసగుసలకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్న స్వరాలను వినిపిస్తున్నాయి.
ఇక హీరో విష్ణు విశాల్‌ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోవడానికి జ్వాలనే కారణం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో వైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ కూడా ఓ కారణమంటూ రూమర్స్‌ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా గతంలోనే కొట్టి పారేసింది.