డిఫరెంట్ లుక్ తో కార్తీ..!

రీసెంట్ గా ‘ఖైదీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటుడు కార్తీ ఈ ఏడాదిలోనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు . ఆ సినిమా పేరే ‘దొంగ’. డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించే ఈ సినిమాలో ‘జ్యోతిక’ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.