బాబా దెబ్బకి నోరెళ్లబెట్టిన శ్రీముఖి..!

బిగ్ బాస్ ..బుల్లితెరపై బిగెస్ట్ రియాలిటీ షో గా టాప్ టిఆర్పి రేటింగ్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 .. 50 రోజులని పూర్తీచేసుకుంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక సలహా ఇచ్చాడు. ఇప్పటికే 50 రోజులు ముగిసిపోయాయి.. ఇక ఎప్పటినుండి బిగ్ బాస్ ఫినాలే ప్రారంభం అవుతోంది. ఇక్కడ నుంచి మీ గురించి మీరు ఆడండి అలా అయితేనే మీరు గెలవగలుగుతారు. గెలవడం కోసం ఆడండి అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో చెప్పాడు. ఇక అలీ ఆలా సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళిపోగానే … ఈ వీక్ నామినేషన్స్ ని స్టార్ట్ చేసాడు బిగ్ బాస్.

ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్‌లో ఉన్న 11 మందిని రెండు గ్రూపులుగా విభజించారు బిగ్ బాస్.అలాగే ఈ వీక్ బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఉన్న బాబా భాస్కర్ ని ఈ నామినేషన్స్ నుండి తప్పించాడు. ఒక గ్రూప్ లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా..ఇంకో గ్రూప్ లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్‌ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు. దీనితో మొదట ఈ నామినేషన్స్ ప్రాసెస్ ని రవి ప్రారంభించాడు. రవి.. రాహుల్, శిల్పలని నామినేట్ చేసాడు. ఆ తరువాత పునర్నవి.. మహేష్, శ్రీముఖి ని నామినేట్ చేసింది. ఆ తరువాత శివజ్యోతి.. పునర్నవి, శిల్పని నామినేట్ చేసింది.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్ప చక్రవర్తి.. జ్యోతి, హిమజలని ఈ వీక్ ఎలిమినేషన్స్ కి నామినేట్ చేసింది. ఆ తరువాత శ్రీముఖి.. పునర్నవి, శిల్పని నామినేట్ చేసింది. అలాగే వితిక.. రవి, మహేష్ ని నామినేట్ చేసింది. ఇక హిమజ.. శిల్ప, వితికలని ఎలిమినేషన్స్ కి నామినేట్ చేసింది. ఆ తరువాత ..వరుణ్.. మహేష్, హిమజ ని నామినేట్ చేసాడు. ఇక మహేష్.. పునర్నవి, వరుణ్ ని నామినేట్ చేసాడు. ఇక చివరగా నామినేషన్స్ స్టార్ రాహుల్.. శ్రీముఖి, రవి లని నామినేట్ చేసాడు. దీనితో మొత్తంగా శిల్ప , పునర్నవి , శ్రీముఖి , మహేష్ , హిమజ , రవి నామినేట్ అయినట్టు తెలిపాడు.

ఇక ఇక్కడే బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటి కెప్టెన్ గా ఉన్న బాబా భాస్కర్ కి ఉన్న ప్రత్యేక అధికారులతో ఒకరిని సేవ్ చేయాలనీ బిగ్ బాస్ తెలిపాడు. దీనితో అందరూ బాబా కి బాగా క్లోజ్ గా ఉండే మహేష్ , శ్రీముఖి లలో ఒకరిని నామినేషన్స్ నుండి సేవ్ చేస్తాడేమో అనుకున్నారు. కానీ , బాబా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గతవారం టాస్క్ లో బాగా ఫోర్ఫామ్ చేశాడంటూ రవిని ఎలిమినేషన్ నుండి బయటపడేసాడు. దీనితో శ్రీముఖి ఫీల్ అయ్యింది. అది ఆమె అప్పుడు చెప్పకపోయినా తరువాత హిమజ తో మాట్లాడుతూ ..తన మనసులో మాటని బయటపెట్టేసింది.