‘వాల్మీకి’ లో నితిన్ గెస్ట్ రోల్..!

67

అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పక్కన పెడితే ఇప్పటివరకూ ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మధ్యలో వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘డీజే’ చిత్రాలు యావరేజ్ గా మాత్రమే నిలిచాయి. ఇక ఈ డైరెక్టర్ కు పెద్దగా అవకాశాలు కూడా ఇవ్వట్లేదు మిగిలిన హీరోలు. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ ఛాన్స్ ఇచ్చాడు. తరువాత ఈయన బిజీ అవ్వాలంటే ఈ సినిమా కచ్చితంగా హిట్టవాల్సి ఉంది. ‘వాల్మీకి’ చిత్రం సెప్టెంబర్ 20 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ జోడిస్తున్నాడు హరీష్.