విజయోత్సాహంలో సంపూర్ణేష్ బాబు!

236

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో హృదయకాలేయం ఫేం స్టీవెన్ శంకర్ అందించిన కథ, కథనంతో రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొబ్బరిమట్ట. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.

‘కొబ్బరి మట్ట’ మూవీ చూసినవారంతా హృదయకాలేయం మించిన వినోదం తాము ఈ సినిమా ద్వారా పొందామని, సంపూ తనదైన శైలిలో థియేటర్లో నవ్వులు పూయించాడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్లకు వచ్చి జనం రెస్పాన్స్ చూసిన సంపూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ‘కిబ్బరి మట్ట’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా కష్టాన్ని ప్రేక్షక దేవుళ్లు అర్థం చేసుకున్నందుకు థాంక్స్. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ఆదరిస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు… అని సంపూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయనే నాగబాబు గారు. సర్ మీరు మాకు సపోర్ట్ చేస్తూ పెట్టిన వీడియో వల్లే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది. మెగా ఫ్యామిలీ నుంచి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీకు పాదాభివందనం. మెగా అభిమానులకు, మెగా ఫ్యామిలీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని సంపూ తెలిపారు.

మొదటి నుంచి నాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మేము అడగ్గానే సాయి అన్న(సాయి ధరమ్ తేజ్) వచ్చి ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే మీరు ఇచ్చిన ధైర్యం మామూలు దైర్యం కాదు. మీ బ్లెస్సింగ్స్ మా లాంటి వారిపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను… అని సంపూ చెప్పుకొచ్చారు.

”హలో స్టీవెన్ శంకర్, సంపూర్ణేష్ బాబు… మీ కొబ్బరి మట్ట చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ట్రైలర్ చూసినపుడే చాలా ఫన్నీగా అనిపించింది. అలాగే మిమ్మల్ని ఎందుకు అంత సపరేటుగా విష్ చేస్తున్నానంటే… మీరిద్దరూ మెగా అభిమానులు. మీరు మమ్మల్ని అంత అభిమానించినపుడు మీ సినిమా కూడా అంత బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్… మీ సినిమా మంచి విజయం అందుకోవాలి.” అంటూ ఇటీవల నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.