పూరితో విజయ్ దేవరకొండ

54

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ విజయాన్ని నమోదు చేసింది. పూరికి ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో వుండనున్నట్టుగా వార్తలు  వచ్చాయి. ఒక సినిమా హిట్ తరువాత ఈ తరహా వార్తలు రావడం సహజమని అంతా లైట్ తీసుకున్నారు.

కానీ నిజంగానే పూరి .. విజయ్ దేవరకొండ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. పూరి దర్శకత్వం వహించే ఈ సినిమాకి ఆయనతో పాటు చార్మీ నిర్మాతగా వ్యవహరించనుంది. పూరి భార్య లావణ్య ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేశారు. పూరి .. చార్మీ .. విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంతో పాటు, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరచనున్నారు.