కెమెరా ముందుకు విజయశాంతి

158

సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 13 ఏళ్ల అనంతరం మళ్లీ మేకప్ వేసుకుంటున్న ఆమెకు దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు చిత్రయూనిట్ ఘనస్వాగతం పలికింది. అందుకు విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు.

“అనిల్ రావిపూడి గారు, మహేశ్ బాబు గారు మీరు సాదర స్వాగతం పలకడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఓ వ్యక్తి ఔన్నత్యం ఏంటో ఆ వ్యక్తి దృక్పథమే చెబుతుంది. క్లైమేట్ మారొచ్చేమో కానీ ఆటిట్యూడ్ మాత్రం మారదు… అది మీ విషయంలోనైనా, నా విషయంలోనైనా!”  అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, సినిమాలోని తన గెటప్ తాలూకు ఫొటో కూడా పోస్టు చేశారు.