నాకు సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది : హీరోయిన్ రెజీనా

31

అడివి శేష్ కథానాయకుడిగా రూపొందిన ‘ఎవరు’ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఆ సినిమాలో కీలకమైన పాత్రను చేసిన రెజీనా, ప్రమోషన్స్ లో బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. “దర్శకుడు వెంకట్ రాంజీ వినిపించిన కథ నాకు బాగా నచ్చింది. దాంతో నేను వెంటనే అంగీకరించాను. ఈ సినిమాలో నేను సమీర అనే పాత్రను చేశాను.

నేను ఇండస్ట్రీకి వచ్చిన ఏడు సంవత్సరాలలో చేసిన మంచి పాత్రలలో ఇది ఒకటి. సమీరకి ఎదురయ్యే సంఘటనలు .. చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్రకి ప్రాధాన్యత ఉండటం వల్లనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకు వస్తుందనే నమ్మకం వుంది. సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చింది.