గుంటూరు లో ఓ బేబీ మూవీ చిత్ర యూనిట్ సందడి

గుంటూరు లో ఓ బేబీ మూవీ చిత్ర యూనిట్ సందడి చేసింది. సురేష్ మూవీ ప్రొడక్షన్స్ లో విడుదలైన ఈ చిత్రం సెక్సెస్ కావడంతో హీరోయిన్, సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేసారు. ముందుగా తమ బ్యానర్ ను ఆదరిస్తూ తమ సినిమాలు చూస్తున్న అభిమానులకు,ప్రేక్షకులతో మా కృతజ్ఞతలు అని తెలిపారు. తాము తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు తీసిన ఓ బేబీ చిత్రం మాత్రం తమకు మంచి గుర్తింపు తెచ్చిందని డైరెక్టర్ నందిని రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం మీడియా తో మాట్లాడిన హీరోయిన్ సమంత నాటి నుంచి నేటి వరకు తను నటించిన సినిమాల్లో కెల్లా ఓ బేబీ చిత్రం తనకు మంచి గుర్తింపు తేవడం గొప్ప శుభపరిణామం అని ఆమె వివరించారు.