సమంత అద్భుతంగా నటించిందన్న బన్నీ

‘ఓ బేబి’ సినిమాతో సమంత మరో హిట్ సొంతం చేసుకుంది. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు. ఈ జాబితాలో తాజాగా అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. ‘ఓ బేబీ’ సినిమా కట్టి పడేసిందని… సమంత నటన అత్యద్భుతమని కితాబిచ్చాడు. డైరెక్టర్ నందినిరెడ్డి మరో సారి తన టాలెంట్ ను నిరూపించుకుందని ప్రశంసించాడు. బన్నీ అభినందనలపై నందినిరెడ్డి స్పందించింది. తనను అన్ని వేళలా ప్రోత్సహిస్తున్న బన్నీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. బన్నీతో కలసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది.

https://twitter.com/nandureddy4u/status/1148062206480678912