టాలీవుడ్ ఆర్టిస్ట్‌లకు తప్పిన పెను ప్రమాదం..!

టాలీవుడ్ ఆర్టిస్ట్‌లు జ్యోతి, గీతాసింగ్, రఘులకు పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తోన్న కారు టైర్ ఊడిపోయింది. దీంతో కారు అదుపు తప్పింది. అయితే అదృష్టవశాత్తు తమకు ఎలాంటి గాయాలు కాలేదని జ్యోతి తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మదనపల్లికి వెళ్లిన వారు ఇవాళ హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. అందుకోసమే వారు తిరుపతికి బయలుదేరి వెళ్లారు.