మెగాస్టార్ ను ఇబ్బంది పెడుతున్న చరణ్..?

మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుతుంది అనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చారిత్రాత్మక సినిమా కావడంతో ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా రావాలని నిర్మాత రామ్ చరణ్ పట్టుబడుతున్నారు.

దీంతో సినిమా ఆలస్యం అవుతున్నది. బెస్ట్ అందించే ఉద్దేశ్యంతో సినిమా చేస్తున్నా.. ఆలస్యం అమృతం విషయం అనే సూత్రం ఆధారంగా సినిమా ఆలస్యం జరిగే కొలది క్యూరియాసిటీ తగ్గిపోతుంది. బెస్ట్ పేరుతొ రీ షూట్ లు చేస్తున్నారు. ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. ఈ సినిమా పూర్తైన వెంటనే మెగాస్టార్ తో కొరటాల శివ సినిమా ప్రారంభం అవుతుంది.

మెగాస్టార్ కు రెస్ట్ తీసుకునే సమయం పెద్దగా ఉండదు. సమయం లేకుండా వెంటనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొనాలి అంటే కష్టమే మరి. కొరటాల తరువాత మెగాస్టార్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ పోవాలి అంటే మధ్యలో కాస్త రెస్ట్ దొరకాలి. సినిమా స్టార్ హీరోనే. కానీ, యంగ్ హీరోలతో సమానంగా రెస్ట్ లేకుండా సినిమా చేయాలంటే ఎలా మరి.

మెగాస్టార్ విషయంలో రామ్ చరణ్ కొద్దిగా అలోచించి సైరాను త్వరగా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. సైరా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. సైరా దసరాకు వస్తుంది కాబట్టి మరో పెద్ద సినిమా రిలీజ్ కాకపోవచ్చు.