‘మహర్షి’ సక్సెస్ మీట్ లో మహేశ్

మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో తన తండ్రి అభిమానులు, తన అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగే చిత్రం ఇది అవుతుందని దర్శకుడు వంశీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమ అభిమానులే కాదు, ‘ఈరోజున నేను కూడా కాలర్ ఎత్తాను.. వంశీ’ అంటూ ఈ చిత్రం విజయం సాధించడంపై మహేశ్ తన సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్ లో ఎంతో విజయవంతమైన చిత్రాలను ఈ చిత్రం అధిగమించబోతోందని అన్నారు. 

నిర్మాత అశ్వనీదత్ తనను ‘ప్రిన్స్ బాబు’ అని పిలుస్తుంటారని, ఆయనకు విపరీతంగా తాను నచ్చినప్పుడు మాత్రం ‘మహేశ్’ అని పిలుస్తారని, ‘మహర్షి’ సినిమా చూసిన తర్వాత ఆయన తనను అలా పిలిచారని మహేశ్ బాబు గుర్తుచేసుకున్నారు.