విమానంలోనే వాడి గూబ పగలగొట్టాను: నటి రక్ష

అందాల కథానాయికగా .. అల్లరి చేసే నాయికగా తెలుగు తెరపై ‘రక్ష’ మంచి మార్కులను కొట్టేసింది. తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా’  కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించారు. “చిన్నప్పటి నుంచి కూడా నాకు కోపం ఎక్కువ. కాలేజ్ రోజుల్లో నాకు ప్రపోజ్ చేయడానికి కుర్రాళ్లు భయపడేవారు. నేను హీరోయిన్ అయిన తరువాత నాతో అసభ్యంగా ప్రవర్తించి తన్నులు తిన్నవాళ్లు వున్నారు.

ఇక బి.గోపాల్ గారు ‘రవన్న’ సినిమా షూటింగు కోసమని చెప్పి నేను చెన్నై నుంచి విమానంలో హైదరాబాద్ వస్తున్నాను. విమానంలో నేను విండో సీట్లో కూర్చుంటే, నా పక్కన ఒక పెద్దాయన కూర్చున్నాడు. కావాలని చెప్పేసి నన్ను తాకడం మొదలుపెట్టాడు. నేను విండో వైపుకు జరుగుతున్నకొద్దీ ఎక్కువ చేస్తున్నాడు. దాంతో ‘ఏంట్రా ఇంత వయసొచ్చినా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్’ అని గూబ పగలగొట్టాను. అక్కడ వున్న వాళ్లంతా నన్ను సపోర్ట్ చేయడం వలన ఆ మనిషి కిక్కురుమనలేదు” అని చెప్పుకొచ్చారు.