టాలీవుడ్ కి భారీ షాక్…!!

ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదికి వందకు తగ్గకుండా సినిమాలు నిర్మించే కెపాసిటీ టాలీవుడ్ సొంతం. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒకపుడు చిత్ర సీమ టాప్ స్టార్స్ నలుగురితో పాటు, సెకెండ్ రేంజి హీరోలు, చిన్న స్టార్లు, ఇలా అంతా కలుపుకుని పాతిక మందికి తక్కువ కాకుండా హీరోలతో వెలుగొందేది. ఏడాదికి ఒక్కోక్కరు నాలుగు మూవీస్ చేసినా ఈజీగా వంద దాటేసేది.

ఇక థియేటర్లకు కూడా మంచి ఫీడింగ్ ఉండేది. నెలకు కచ్చితంగా ఎనిమిది నుంచి పది సినిమాలు అన్ని రకాల కధలతో వచ్చేవి. హిట్ల శాతం కూడా ఎక్కువగా ఉండేది. అయితే మిలీనియం లోకి ప్రవేశించాక టాలీవుడ్ పోకడే మారిపోయింది. చిన్న హీరోలు, సెకండ్ గ్రేడ్ హీరోలకు రోజులు చెల్లిపోయాయి. మొత్తం టాప్ స్టార్స్ మీద ఇండస్ట్రీ డిపెండ్ అయిపోయింది. ఐతే ఆ ధోరణి వల్ల హిట్లు కంటే ఫ్లాప్స్ ఎక్కువగా వస్తున్నాయి.

దానికి తోడు హీరోలు ఏడాదికి మింఛి ఓ సినిమా మాత్రమే చేస్తూ పోతున్నారు. ఇక సినిమా హాళ్ళకు ఫీడింగ్ పెద్ద సమస్య అయిపోతోంది. దాంతో బంగారం లాంటి సీజన్లు మునిగిపోతున్న ఎవరికీ పట్టింపు ఉండడం లేదు. దానికి మంచి ఉదాహరణ ఈసారి సమ్మర్ సీజన్. దాదాపు రెండు నెలలలు పైగా సమ్మర్ సీజన్ ఉంటే సరైన సినిమా ఒక్కటీ పడడంలేదు. కేవలం మహేష్ మూవీ మాత్రమే వస్తోంది.

ఇక టాప్ హీరోల విషయానికి వస్తే జూనియర్ ఎంటీయార్, రాం చరణ్ జక్కన్న మూవీ ఆర్ ఆర్ ఆర్ కి లాక్ అయిపొయారు. ప్రభాస్ రెండేళ్ళుగా సాహో అంటున్నాడు తప్ప ఫినిష్ చేయడంలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల బాట పట్టాడు. అల్లు అర్జున్ ఏడాదిగా ఖాళీగా ఉండి ఇపుడే కొత్త మూవీ సెట్స్ మీదకు తెచ్చాడు

బాలయ్య రెండు మూవీస్ జనవరరి, ఫిబ్రవరిలో వదిలేశాడు. చిరంజీవి సైరా మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఇలా మొత్తానికి మొత్తం సమ్మర్ ని వదిలేశారు. కోట్ల ఖర్చుతో సినిమా హాళ్ళు కట్టిన వారికి ఇది పెద్ద షాక్ అయితే, సమ్మర్ ఎంటర్టైన్మెంట్ లేక జనాలకూ హీటెక్కిపోతోంది.