సాయిధరమ్ తేజ్ లో ముగ్గురు మావయ్యల లక్షణాలు ఉన్నాయి:హైపర్ ఆది

సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చిత్రలహరి’కి మంచి ఆదరణ లభిస్తోంది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో ‘జబర్దస్త్’ ఫేమ్ హైపర్ ఆది కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

“సాయిధరమ్ తేజ్ ను నేను దగ్గరగా పరిశీలించడం వలన నాకు ఒక విషయం అర్థమైంది. ఆయనకి ముగ్గురు మేనమామల లక్షణాలు వచ్చాయి. చిరంజీవిగారిలా సెట్స్ లో ఆయన అందరినీ సమానంగా చూసుకుంటాడు. నాగబాబుగారిలా ఆయనలో ఎలాంటి కల్మషం కనిపించదు. ఇక పవన్ కల్యాణ్ గారిలా ఇతరులకు సాయం చేసే విషయంలో ఆయన ఎంతమాత్రం ఆలోచించడు. ముగ్గురు మేనమామల నుంచి గొప్ప లక్షణాలు అలవరచుకున్న తేజుతో కలిసి నటించే అవకాశం లభించడం ఆనందంగా వుంది” అంటూ చెప్పుకొచ్చాడు.