మరి కాసేపట్లో `టైగర్ కేసీఆర్‌`ఫస్ట్‌లుక్‌

`లక్ష్మీస్ ఎన్టీయార్‌` పేరుతో వివాదాస్పద బయోపిక్‌ను తెరకెక్కించిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం మరో బయోపిక్‌ను తెరకెక్కించే పనిలోబిజీగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఓ బయోపిక్‌ను రూపొందించనున్నారు. ఈ సినిమాకు `టైగర్ కేసీఆర్‌` అనే టైటిల్ పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను ఇందులో చూపించనున్నారు.

ఈ సినిమాలో ఏయే పాత్రలుంటాయో తాజాగా వర్మ ట్విటర్ ద్వారా రివీల్ చేశారు. “టైగర్ కేసీఆర్‌` సినిమాలో కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్ రావు, వైఎస్సార్‌, వైఎస్ జగన్‌, చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్‌, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీరావు, లోక్‌ష్ తదితర పాత్రలు ఉండబోతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం 11 గంటలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయబోతున్నామ`ని వర్మ ట్వీట్ చేశారు.