బాలయ్యతో బోయపాటి కొత్త సినిమా !

ఊచకోతను గ్రాండ్‌గా చూపించేందుకు ఇష్టపడే టాలీవుడ్ దర్శకుడు బోయపాటి ఇలాంటిదే మరో ప్రాజక్టుకు రెడీ అవుతున్నారు. అదీ బాలయ్యబాబుతోనే. ఇప్పటికే వీరురువురి కాంబినేషన్లో పలు హిట్ మూవీస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఊచకోత ఉండబోతోందని తెలుస్తోంది. బోయపాటికి బాలయ్యే సరైన జోడీ అనే టాక్ కూడా తెలుగుప్రేక్షకుల్లో ఉంది.

దీంతో బాలకృష్ణతో చేయబోతోన్న కొత్త మూవీ నందమూరి అభిమానులకు మంచి వార్తనే చెప్పాలి. శుక్రవారం దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు బోయపాటికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.