మెగా స్టామినా చాటిన సాయిధర్మతేజ్ ..

మెగా మేనళ్లుడు సాయిధర్మతేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. లైఫ్ అంతా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న విజయ్ కథతో వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం తన కెరియర్ లో సక్సెస్ కోసం చేస్తున్న ప్రయత్నం నిజంగానే సక్సెస్ అయ్యింది. వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అవడంతో చిత్రలహరి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు సాయిధర్మతేజ్.

కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యింది. ఏప్రిల్ 12 శుక్రవారం రిలీజైన ఈ సినిమా 3 రోజుల్లో 7.75 అది కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే సంపాదించడం విశేషం. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సాయి ధర్మతేజ్ సూపర్ హిట్ సినిమా చిత్రలహరికి దక్కింది.

సినిమా మొదటిరోజు మిక్సెడ్ టాక్ ఉన్నా ఫైనల్ గా సినిమా ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక ఏరియాల వారిగా చిత్రలహరి 3 డేస్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 2.53 కోట్లు

సీడెడ్: 1.28 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.10 కోట్లు

కృష్ణ: 0.60 కోట్లు

గుంటూరు: 0.67 కోట్లు

ఈస్ట్ : 0.78 కోట్లు

వెస్ట్: 0.50 కోట్లు

నెల్లూరు: 0.29 కోట్లు

ఏపీ/ తెలంగాణా : 7.75 కోట్లు