డిఫరెంట్ లుక్ తో సల్మాన్

బాలీవుడ్లో తిరుగులేని కథానాయకుడిగా సల్మాన్ కొనసాగుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ‘భరత్’ రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా సల్మాన్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. జీవితంలో పోరాడి అలసిపోయిన మధ్య వయసున్న వ్యక్తిలా సల్మాన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

నెరిసిన గెడ్డం ..  మెలితిరిగిన మీసాలు .. కొత్తరకం హెయిర్ స్టైల్ .. నలుపు రంగు ఫ్రేమ్ కళ్లద్దాలతో సల్మాన్ కనిపిస్తున్నాడు. ఈ డిఫరెంట్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  సల్మాన్ సరసన కథానాయికగా కత్రినా కైఫ్ నటిస్తుండగా, టబు .. దిశా పటాని .. జాకీ ష్రాఫ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా పనులు నడుస్తున్నాయి. ఈ సినిమాతో సల్మాన్ మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.