‘చిత్రలహరి’ సినిమా చుసిన మెగాస్టార్ చిరంజీవి..

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన ‘చిత్రలహరి’ సినిమా ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో థియేటర్లకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన చిరంజీవి .. తనదైన శైలిలో స్పందించారు.

‘చిత్రలహరి’ సినిమా చూశాను .. చాలా బాగుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఆద్యంతం ఈ సినిమాను ఆసక్తికరంగా నడిపిస్తూ చక్కని ప్రతిభను కనబరిచారు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో యువత ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇవ్వడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

ఇక తేజు నటనలో మునుపటికన్నా మంచి పరిణతి కనిపించింది. మిగతా నటీనటులంతా కూడా చాలా చక్కగా పాత్ర పరిథిలో మెప్పించారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి .. సునీల్ చాలా బాగా చేశారు. సంగీతం పరంగా చూసుకుంటే .. దేవిశ్రీ ప్రసాద్ తన సత్తాను మరోమారు చాటుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ సినిమాతో వాళ్ల బ్యానర్ ప్రతిష్ఠ మరింత పెరిగింది’ అని చెప్పుకొచ్చారు.